COVID-19 (నోవల్ కరోనావైరస్) - వాషింగ్టన్ రాష్ట్రంలోని సమాచారం, సేవలు మరియు వనరులు

COVID-19 హాట్లైన్

COVID-19 గురించి మీకు ప్రశ్నలు ఉంటే, దయచేసి 1-800-525-0127 కు కాల్ చేసి # నొక్కండి. వారు స్పందించినప్పుడు, వ్యాఖ్యాన సేవలకు ప్రాప్యత పొందడానికి మీ భాష పేరును చెప్పండి. హాట్లైన్ సోమవారం-శుక్రవారం ఉదయం 6 a.m. నుండి రాత్రి 10 p.m. వరకు మరియు శనివారం-ఆదివారం వరకు ఉదయం 8 a.m. నుండి రాత్రి 6 p.m. వరకు తెరిచి ఉంటుంది.

Washington State Commission on Asian Pacific American Affairs (CAPAA)

నా ఫోన్కు WA Notify ఎలా లభ్యం అవుతుంది?

iPhoneలో, సెట్టింగ్లలో ఉన్న Exposure Notificationsను అనుమతించండి:

-    సెట్టింగ్లకు వెళ్ళండి
-    Exposure Notifications వరకు కిందకు స్క్రోల్ చేయండి
-    “Exposure Notificationsను ఆన్ చేయండి”ని క్లిక్ చేయండి
-    యునైటెడ్ స్టేట్స్ను ఎంచుకోండి
-    వాషింగ్టన్ను ఎంచుకోండి

Android ఫోన్లో:

-    Google Play Store కు వెళ్లండి
-    Washington Exposure Notifications యాప్ను డౌన్లోడ్ చేసుకోండి (WA Notify)

Washington Exposure Notifications (వాషింగ్టన్ ఎక్స్పోజర్ నోటిఫికేషన్స్) అంటే ఏమిటి?

బొమ్మ
WA Notify ఎలా పనిచేస్తుంది

 

 

Washington Exposure Notifications (WA Notify (డబ్ల్యూఏ నోటిఫై) అని కూడా అంటారు) అనేది వ్యక్తిగత సమాచారాన్ని షేర్ చేయకుండానే స్మార్ట్ఫోన్ల ద్వారా, వినియోగదారులను వారు కోవిడ్-19కు ఎక్స్పోజ్ అయి ఉండవచ్చని అప్రమత్తం చేసే కొత్త సాధనం. ఇది పూర్తిగా ప్రైవసీని కలిగినది, మీరు ఎవరో లేదా మీరు ఎక్కడికి వెళ్తున్నారో దానికి తెలియదు లేదా అది జాడ తెలుసుకోదు.

ఇది ఎలా పని చేస్తుంది?

మీరు WA Notifyని అనుమతించినప్పుడు, మీ ఫోన్ మీకు సమీపంలో ఉన్న వారు ఎవరైనా WA Notifyని అనుమతించివుంటే ఆ వ్యక్తుల ఫోన్లతో గుర్తుతెలియని, రహస్య సంకేతాలను మార్పిడి చేసుకుంటుంది. మీకు సంబంధించిన ఎలాంటి సమాచారాన్ని వెల్లడించకుండా ఈ గుర్తుతెలియని సంకేతాలను మార్పిడి చేసుకోవడం కోసం ఈ యాప్ Bluetooth Low Energy (BLE) (బ్లూటూత్ లో ఎనర్జీ (BLE)) సాంకేతికతను ఉపయోగిస్తుంది. గత రెండు వారాల్లో మీకు దగ్గరలో ఉన్న మరొక WA Notify వినియోగదారుకు ఆ తరువాత COVID-19 పాజిటివ్ అని పరీక్షలో తేలి, వారు తమ ధృవీకరణ సంఖ్యను ఈ యాప్కు జోడిస్తే, మీరు ఎక్స్పోజ్ అయి ఉండే అవకాశం ఉన్నదనే ఒక అజ్ఞాత నోటిఫికేషన్ మీకు అందుతుంది. ఇది మీకు అవసరమైన ఆరోగ్య సంరక్షణ సత్వరమే అందేలా చేసి, మీరు మీ చుట్టుపక్కల వారికి కోవిడ్-19ను వ్యాపింపచేయకుండా నిరోధించడంలో సహాయపడుతుంది.

ఇది ఎలా సహాయపడుతుంది?

Exposure Notificationను ఎక్కువ మంది ఉపయోగించడం వలన ఎక్కువ ప్రయోజనం కలుగుతుందని అధ్యయనాలలో వెల్లడైంది. WA Notifyని ఉపయోగిస్తున్న వారు తక్కువ సంఖ్యలో ఉన్నా ఈ అంటువ్యాధి సోకడాలు, మరణాలు తగ్గుతాయని వాషింగ్టన్ రాష్ట్రంలోని మూడు కౌంటీలపై ఆధారపడిన నమూనాలు తెలుపుతున్నాయి. మాస్క్లను ధరించడం, భౌతిక దూరం పాటించడం, చిన్న సమావేశాలను నిర్వహించడం వంటి వాటిలాగే WA Notify కూడా కోవిడ్-19 వ్యాప్తిని నివారించడానికి సహాయపడే మరొక సాధనం.

నా గోప్యతను ఎలా పరిరక్షిస్తారు?

WA Notify అనేది Google Apple Exposure Notification సాంకేతికతపై ఆధారపడినది, వినియోగదారు గోప్యతను పరిరక్షించేదిగా దీనిని రూపొందించారు. ఈ వ్యవస్థ Google, Apple, Washington State Department of Health (DOH) (వాషింగ్టన్ రాష్ట్ర ఆరోగ్య శాఖ(DOH)) లేదా మరే ఇతర వినియోగదారులతోనూ షేర్ చేయదు. ఇందులో పాల్గొనడం పూర్తిగా స్వచ్ఛందమైనది. వినియోగదారులు ఎప్పుడైనా దీనిలో పాల్గొనాలని లేదా విరమించుకోవాలని ఎంచుకోవచ్చు.

వాషింగ్టన్ రాష్ట్రం ఈ పరిష్కారాన్ని ఎందుకు ఎంచుకుంది?

వాషింగ్టన్ రాష్ట్రం Apple/Googleల ఈ పరిష్కారాన్ని సమీక్షించడానికి భద్రత, పౌర స్వేచ్ఛల నిపుణులు, పలు ప్రజాసంఘాల సభ్యులతో కూడిన ఒక రాష్ట్రస్థాయి పర్యవేక్షక బృందాన్ని ఏర్పాటు చేసింది. ఈ యాప్ వేదికకు సంబంధించిన నిరూపితమైన విశ్వసనీయత, దృఢమైన డేటా పరిరక్షణ, ఇతర రాష్ట్రాల ఉపయోగం ఆధారంగా ఈ బృందం దీనిని స్వీకరించాలని సిఫారసు చేసింది.

Exposure Notification (ఎక్స్పోజర్ నోటిఫికేషన్) FAQ

1.    నేను WA Notifyని ఉపయోగించడాన్ని ప్రారంభించాలా?

అవును. WA Notify ఉచితము, స్వచ్ఛందము. మీరు ఎప్పుడైనా దానిని నిలిపివేయవచ్చు. కేవలం ఆ ఫీచర్ను ఆపివేయండి లేదా ఆ యాప్ను తొలగించండి. దగ్గరలోని ఇతర యూజర్ల నుంచి వచ్చిన గుర్తుతెలియని సంకేతాలన్నీ ఫోన్లో నుంచి తొలగిపోతాయి, వాటిని తిరిగి రాబట్టలేం.

2.    WA Notify కాంటాక్ట్ల జాడను కనిపెట్టే యాపా?

కాదు. కాంటాక్టుల జాడను కనిపెట్టడం జరిగితే కోవిడ్-19 అని పరీక్షలో తేలిన వ్యక్తికి దగ్గరగా ఉన్న వ్యక్తులను గుర్తుపట్టడం జరుగుతుంది. WA Notify మీరు కలుసుకున్న వ్యక్తుల గురించిన సమాచారాన్ని జాడ తీయదు లేదా పసిగట్టదు. కాబట్టి ఇది “కాంటాక్ట్లను పసిగట్టడం” చేయదు. ఈ యాప్ ఎలాంటి వ్యక్తిగత సమాచారాన్ని సేకరించదు లేదా మార్పిడి చేయదు, కాబట్టి ఇది మీరు ఎవరిని కలుసుకుంటున్నారు అనేదానిని తెలుసుకోవడం ఏ సంస్థకు సాధ్యం కాదు.

3.    “ఎక్స్పోజర్” అంటే ఏమిటి?

తరువాత కోవిడ్-19 పాజిటివ్అని పరీక్షలో తేలిన మరొక WA Notify యూజర్కు దగ్గరగా మీరు చెప్పుకోదగినంత సమయం గడిపినప్పుడు ఎక్స్పోజర్ జరుగుతుంది. ఇది భౌతిక దూరం, కోవిడ్-19 సోకడాలకు సంబంధించి ప్రస్తుత CDC మార్గదర్శకాలను అనుసరిస్తుంది.

4.    నేను ఎక్స్పోజ్ అయి ఉండవచ్చునని WA Notify నాకు తెలిపితే ఏమి జరుగుతుంది?

మీరు ఎక్స్పోజ్ అయి ఉండవచ్చని WA Notify గుర్తిస్తే, మీ ఫోన్లోని ఒక నోటిఫికేషన్ మీరు తదుపరి ఏమి చేయాలి అనే సమాచారంతో కూడిన వెబ్సైట్కు దారి చూపుతుంది. దీనిలో ఎలా, ఎక్కడ పరీక్ష చేయించుకోవాలి అనేది, మీరు, మీకు సన్నిహితంగా ఉండేవారు సురక్షితంగా ఉండటానికి సంబంధించిన సమాచారం, మీ ప్రశ్నలకు సమాధానాలు లభించే వనరులు ఉంటాయి. ఆ వెబ్సైట్లోని సూచనలను శ్రద్ధగా చదివి, వాటిని పాటించడం ముఖ్యం.

5.    నా గోప్యతను ఎలా పరిరక్షిస్తారు?

WA Notify అనేది Google Apple Exposure Notification సాంకేతికతపై ఆధారపడినది, ఉపయోగదారుల గోప్యతను పరిరక్షించే విధంగా దీనిని రూపొందించారు. ఈ వ్యవస్థ ఎలాంటి లొకేషన్ డేటాను లేదా వ్యక్తిగత సమాచారాన్ని ఎప్పుడూ సేకరించదు, Google, Apple, Washington State Department of Health (వాషింగ్టన్ రాష్ట్ర ఆరోగ్య శాఖ) (DOH)(డిఒహెచ్)లతో లేదా ఇతర యూజర్లతో వాటిని షేర్ చేసుకోదు. దీనిలో పాల్గొనడం పూర్తిగా స్వచ్ఛందం. యూజర్లు ఎప్పుడైనా దీనిని ఎంచుకోవచ్చు లేదా నిలిపివేయవచ్చు. యూజర్ గోప్యతను ఎలా పరిరక్షిస్తారనే దాని గురించి మరింత సమాచారం కోసం, WA Exposure Notifications గోప్యతా విధానాన్ని చూడండి.

6.    నాకు కోవిడ్-19 అని పరీక్షలో తేలితే అది అందరికీ తెలుస్తుందా?

లేదు. WA Notify మీ గురించిన ఎలాంటి సమాచారాన్ని ఎవరితోనూ షేర్ చేయదు. ఎవరికైనా వారు ఎక్స్పోజర్కు గురై ఉండే అవకాశం ఉన్నదనే నోటిఫికేషన్ అందినప్పుడు, వారికి గత 14 రోజులలో తమకు దగ్గరగా ఉన్న ఎవరికో కోవిడ్-19 పాజిటివ్ అని పరీక్షలో తేలిందని మాత్రమే తెలుస్తుంది. ఆ వ్యక్తి ఎవరో లేదా ఎక్స్పోజర్ ఎక్కడ జరిగిందో వారికి తెలియదు.

7.    WA Notify కోసం నేను ఏమైనా చెల్లించాలా?

లేదు. WA Notify యాప్ ఉచితం.

8.    WA Notify వాషింగ్టన్ రాష్ట్రానికి ఎలా సహాయపడుతుంది?

Exposure Notificationను ఎక్కువ మంది ఉపయోగించడం వలన ఎక్కువ ప్రయోజనం కలుగుతుందని అధ్యయనాలలో వెల్లడైంది. WA నోటిఫైని ఉపయోగిస్తున్న వారు తక్కువ సంఖ్యలో ఉన్నా కోవిడ్-19 సోకడాలు, మరణాలు తగ్గుతాయని వాషింగ్టన్ రాష్ట్రంలోని మూడు కౌంటీలపై ఆధారపడిన నమూనాలు తెలుపుతున్నాయి. మాస్క్లను ధరించడం, భౌతిక దూరం పాటించడం, చిన్న సమావేశాలను నిర్వహించడం వంటి వాటిలాగే WA Notify కూడా కోవిడ్-19 వ్యాప్తిని నివారించడానికి సహాయపడే మరొక సాధనం.

9.    మీరు రాష్ట్రం బయటకు ప్రయాణించినప్పుడు WA Notify పని చేస్తుందా?

అవును. మీరు Apple/Google సాంకేతికతను ఉపయోగించే ఈ యాప్ను వాడే రాష్ట్రానికి వెళితే, మీ ఫోన్ ఆ రాష్ట్రంలోని యూజర్లతో గుర్తుతెలియని సంకేతాలను మార్పిడి చేసుకుంటూనే ఉంటుంది. మీ యాప్ సెట్టింగ్లలో దేనినీ మార్చవలసిన అవసరం లేదు. మీరు ఎక్కువ కాలంపాటు వాషింగ్టన్ నుండి బయటకు వెళ్లినట్టయితే, స్థానికమైన సహాయం, హెచ్చరికలను పొందడం కోసం మీరు మీ కొత్త రాష్ట్రానికి సంబంధించిన ఎంపికలను పరిశీలించాలి.

10.    మనకు కాంటాక్ట్లను కనిపెట్టడం, WA Notify రెండూ ఎందుకు అవసరం?

వ్యాధికి సంబధించిన కాంటాక్ట్లను కనిపెట్టడం అనేది దశాబ్దాల తరబడి ప్రజారోగ్యం విషయంలో సమర్థవంతమైన జోక్యంగా ఉంటున్నది. WA Notify ఈ పనికి అజ్ఞాతంగా మద్దతు ఇస్తుంది. ఇక్కడ ఒక ఉదాహరణ: మీకు కోవిడ్-19 పాజిటివ్ అని పరీక్షలో తేలితే, ప్రజారోగ్య శాఖ అధికారులు ఇటీవల మీతో సన్నిహిత సంబంధాలను కలిగి ఉన్న వారి సమాచారాన్ని షేర్ చేయమని మిమ్మల్ని కోరవచ్చు. బస్సులో మీకు దగ్గరగా కూర్చున్న అపరిచిత వ్యక్తి పేరును మీరు చెప్పలేరు. మీరు ఇద్దరూ WA నోటిఫైని ఉపయోగిస్తుంటే, బస్సులోని ఆ అపరిచిత వ్యక్తిని ఎక్స్పోజర్అవకాశం గురించి, వారి స్నేహితులకు, కుటుంబ సభ్యులకు కోవిడ్-19 వ్యాప్తి చెందకుండా నిరోధించడానికి చర్యలు తీసుకోవడం గురించి అజ్ఞాతంగా అప్రమత్తం చేయవచ్చు. కలసికట్టుగా వారు కోవిడ్-19 వ్యాప్తిని మరింత సమర్థవంతగా నిరోధిస్తారు.

11.    ఇతర యూజర్లకు నోటిఫై చేయడానికి WA Notifyకి ఎంత సమయం పడుతుంది?

కోవిడ్ పాజిటివ్ యూజర్ తన ధృవీకరణ సంఖ్యను WA Notifyలో నమోదు చేసిన 24 గంటలలోగా యూజర్లకు వారు మరొక యూజర్ ద్వారా కోవిడ్-19కు ఎక్స్పోజ్ అయి ఉండవచ్చనే నోటిఫికేషన్ అందుతుంది.

12.    WA Notify నుండి పలు హెచ్చరికలు అందడం సాధ్యమేనా?

అవును, అనేకసార్లు ఎక్స్పోజ్ అయివుండే అవకాశం ఉన్న యూజర్లకు ప్రతి కొత్త ఎక్స్పోజర్ గురించి నోటిఫై చేయడం జరుగుతుంది.

13.    నాకు కోవిడ్ పాజిటవ్ అని పరీక్షలో తేలిందని నేను WA Notifyకి ఎలా చెప్పాలి?

మీకు కోవిడ్ పాజిటవ్ అని పరీక్షలో తేలితే ప్రజారోగ్య శాఖ అధికారులు మిమ్మల్ని కలుసుకుని, మీరు WA Notifyని వాడుతున్నారా అని అడుగుతారు.  మీరు వాడుతుంటే, వారు ఒక ధృవీకరణ సంఖ్యను సృష్టించి, దానిని WA Notifyలో నమోదు చేయడంలో మీకు సహాయపడతారు. ఈ సంఖ్య మీ వ్యక్తిగత సమాచారంతో ముడిపడి ఉండేది కాదు. మీరు మీ ధృవీకరణ సంఖ్యను నమోదు చేసినప్పుడు యాప్ ద్వారా ఎక్స్పోజర్ గురించి ఎవరికి నోటిఫై చేస్తున్నారో తెలుసుకునే మార్గమేదీ ప్రజారోగ్య శాఖ వారికి లేదు. ఈ నోటిఫికేషన్లో మీకు సంబంధించిన ఎలాంటి సమాచారం ఉండదు. ఎంత ఎక్కువ మంది తమ ధృవీకరణ సంఖ్యలను షేర్ చేస్తే, అంత మెరుగ్గా కోవిడ్-19 వ్యాప్తిని నిరోధించగలుగుతాం.

14.    WA Notifyని నా ఫోన్కు చేర్చిన తర్వాత నేను చేయవలసినది ఏమైనా ఉన్నదా?

అదనపు చర్యలు అవసరమయ్యేది ఈ సందర్భాలలో మాత్రమే:
1.    మీకు కోవిడ్-19 పాజిటివ్ అని పరీక్షలో తేలితే, లేదా
2.    మీరు ఎక్స్పోజ్ అయి ఉండవచ్చనే నోటిఫికేషన్ను మీరు అందుకున్నారు.

మీకు కోవిడ్ పాజిటవ్ అని పరీక్షలో తేలితే, ప్రజారోగ్య శాఖ అధికారులు మిమ్మల్ని కలుసుకుని, మీరు WA Notifyని వాడుతున్నారా అని అడుగుతారు. మీరు వాడుతుంటే, వారు ఒక ధృవీకరణ సంఖ్యను సృష్టించి, దానిని WA Notifyలో నమోదు చేయడంలో మీకు సహాయపడతారు. ఈ సంఖ్య మీ వ్యక్తిగత సమాచారంతో ముడిపడి ఉండేది కాదు. మీరు మీ ధృవీకరణ సంఖ్యను నమోదు చేసినప్పుడు యాప్ ద్వారా ఎక్స్పోజర్ గురించి ఎవరికి నోటిఫై చేస్తున్నారో తెలుసుకునే మార్గమేదీ ప్రజారోగ్య శాఖ వారికి లేదు. ఈ నోటిఫికేషన్లో మీకు సంబంధించిన ఎలాంటి సమాచారం ఉండదు. ఎంత ఎక్కువ మంది తమ ధృవీకరణ సంఖ్యలను షేర్ చేస్తే, అంత మెరుగ్గా కోవిడ్-19 వ్యాప్తిని నిరోధించగలుగుతాం.

మీరు ఎక్స్పోజ్ అయి ఉండవచ్చని WA Notify గుర్తిస్తే, మీ ఫోన్లోని ఒక నోటిఫికేషన్ మీరు తదుపరి ఏమి చేయాలి అనే సమాచారంతో కూడిన వెబ్సైట్కు దారి చూపుతుంది. దీనిలో ఎలా, ఎక్కడ పరీక్ష చేయించుకోవాలి అనేది, మీరు, మీకు సన్నిహితంగా ఉండేవారు సురక్షితంగా ఉండటానికి సంబంధించిన సమాచారం, మీ ప్రశ్నలకు సమాధానాలు లభించే వనరులు ఉంటాయి. ఆ వెబ్సైట్లోని సూచనలను శ్రద్ధగా చదివి, వాటిని పాటించడం ముఖ్యం. ఈ నోటిఫికేషన్లో ఎవరి వలన లేదా ఎక్కడ మీరు ఎక్స్పోజ్ అయి ఉండవచ్చు అనే వాటికి సంబంధించిన సమాచారం ఏదీ ఉండదు. ఇది పూర్తి గా అజ్ఞాతంగా ఉంటుంది.

15.    WA Notifyని ఉపయోగించడం వలన నా బ్యాటరీ హరించుకు పోవడం లేదా చాలా డేటాను వాడేయడం జరుగుతుందా?

లేదు. Bluetooth Low Energy సాంకేతికతను ఉపయోగించి దీనిని డేటాపైన, బ్యాటరీ జీవితంపైన కనీస ప్రభావాన్ని చూపేలా రూపొందించారు.

16.    WA Notify పని చేయాలంటే నేను బ్లూటూత్ను ఆన్ చేసి ఉంచడం అవసరమా?

అవును. WA Notify Bluetooth Low Energyని ఉపయోగిస్తుంది, కాబట్టి ఈ వ్యవస్థ దగ్గరలోని ఇతర యూజర్లను గుర్తించడం కోసం బ్లూటూత్ ఎల్లప్పుడూ పని చేస్తూ ఉండాలి.

17.    ఇది పనిచేయడం కోసం నా ఫోన్లో WA Notifyని తెరచి ఉంచాల్సిన అవసరం ఉందా?

లేదు. WA Notify నేపథ్యంలో పని చేస్తుంది.

18.    WA Notify తప్పుడు పరీక్ష నివేదికలను ఎలా నిరోధించగలుగుతంది?

యూజర్లు ప్రజారోగ్య శాఖ అధికారులు అందించిన ధృవీకరణ సంఖ్యను ఉపయోగించి పాజిటివ్ పరీక్షలను WA Notifyకి ధృవీకరించడం అవసరం. ఈ సంఖ్య వ్యక్తి గుర్తింపుతో ముడిపడి ఉండేది కాదు. ధృవీకరణ సంఖ్యను నమోదు చేసిన తర్వాత, WA Notify దగ్గరలో ఉన్న యూజర్ల గుర్తుతెలియని సంకేతాలు మ్యాచ్ అయినట్లయితే, ఎక్స్పోజర్ గురించి వారికి నోటిఫై చేయడం జరుగుతుంది. ఈ నోటిఫికేషన్లో మీరు ఎవరి వలన లేదా ఎక్కడ ఎక్స్పోజ్ అయి ఉండవచ్చు అనే వాటికి సంబంధించిన సమాచారం ఏదీ ఉండదు.

19.    పాత స్మార్ట్ఫోన్లకు WA Notify మద్దతు ఇస్తుందా?

ఐఫోన్ వినియోగదారులు WA Notifyని ఉపయోగించగలగాలంటే మీకు ఉండాల్సిన ఆపరేటింగ్ సిస్టమ్:

  • iOS వెర్షన్ 13.7 లేదా తరువాతది (iPhone 6s, 6s Plus, SE లేదా మరింత కొత్త వాటికి)
  • iOS వెర్షన్ 12.5 (iPhone 6, 6 plus, 5s కోసం)

ఆండ్రాయిడ్ యూజర్లు WA Notifyని ఉపయోగించుకోవాలంటే, మీ ఆండ్రాయిడ్ స్మార్ట్ఫోన్ బ్లూటూత్ లో ఎనర్జీని సపోర్ట్ చేసేట్లయితే, ఆండ్రాయిడ్ వెర్షన్ 6 (API 23) లేదా అంతకంటే ఎక్కువ వెర్షన్ ఉండాలి.

20.    WA Notifyని ఉపయోగించడానికి నాకు 18 ఏళ్లు ఉండాలా?

లేదు. WA Notifyకి మీ వయస్సు తెలియదు లేదామీ వయస్సును సరిచూడ లేదు.

21.    నేను ఎవరితోనైనా ఫోన్ను పంచుకుంటే ఈ సాంకేతికత పనిచేస్తుందా?

ఎక్స్పోజ్ అయి ఉండే అవకాశం ఉన్న సమయంలో ఫోన్ను ఎవరు ఉపయోగిస్తున్నారో WA Notify చెప్పలేదు. మీరు ఫోన్ను పంచుకుంటూ ఉంటే, WA NOTIFYకోవిడ్-19 ఎక్స్పోజర్కు అవకాశం ఉందని సూచిస్తే ఆ ఫోన్ను ఉపయోగించే ప్రతి ఒక్కరూ ప్రజారోగ్య సూచనలను పాటించాలి.

22.    iPadలు లేదా స్మార్ట్ వాచీల వంటి పరికరాల్లో WA Notify పని చేస్తుందా?

లేదు. ఎక్స్పోజర్ నోటిఫికేషన్ ఫ్రేమ్వర్క్ ప్రత్యేకించి స్మార్ట్ఫోన్ల కోసం రూపొందించబడినది, iPadలు లేదా టాబ్లెట్లను సపోర్ట్ చేయదు.

23.    వాషింగ్టన్ రాష్ట్రం ఈ పరిష్కారాన్ని ఎందుకు ఎంచుకుంది?

వాషింగ్టన్ రాష్ట్రం Apple/Google పరిష్కారాన్ని సమీక్షించడానికి భద్రత, పౌర స్వేచ్ఛల నిపుణులు, పలు ప్రజాసంఘాల సభ్యులతో కూడిన ఒక రాష్ట్రస్థాయి పర్యవేక్షక బృందాన్ని ఏర్పాటు చేసింది. ఈ యాప్ ప్లాట్ఫామ్కు సంబంధించిన నిరూపితమైన విశ్వసనీయత, దృఢమైన డేటా పరిరక్షణ, ఇతర రాష్ట్రాల ఉపయోగం ఆధారంగా ఈ బృందం దీనిని స్వీకరించాలని సిఫారసు చేసింది.

24.    స్మార్ట్ ఫోన్లు లేని వ్యక్తులకు ఈ సాంకేతికత అందేలా చేయడానికి వాషింగ్టన్ రాష్ట్రం ఏమి చేస్తోంది?

WA Notify కోవిడ్-19 వ్యాప్తిని నివారించడానికి సహాయపడే ఏకైక సాధనం కాదు. కాంటాక్ట్లను కనిపెట్టడం తదితర చర్యలు వాషింగ్టన్ రాష్ట్ర వాసులు అందరికీ, వారికి స్మార్ట్ఫోన్లు లేకపోయినా, మేలు చేస్తాయి. మాస్క్లను ధరించడం, భౌతిక దూరం పాటించడం, చిన్న సమావేశాలను నిర్వహించడం కోవిడ్-19 వ్యాప్తిని నివారించడానికి సహాయపడగల ఇతర మార్గాలు.

25.    నా WA Notify డేటాను ప్రజారోగ్య వ్యవస్థకు అందించడం గురించి నాకు నోటిఫికేషన్ వచ్చింది. ఎందుకు?

Washington State Department of Health (DOH వాషింగ్టన్ రాష్ట్ర ఆరోగ్య శాఖ), WA Notify ఎంత బాగా పనిచేస్తుందో తెలుసుకోవాలని అనుకుంటున్నది. కాబట్టి మేము ఆ సాధనానికి అవసరమైన ఏవైనా మెరుగుదలలను చేయగలుగుతాము. మీరు మీ WA Notify డేటాను షేర్ చేయడానికి అంగీకరిస్తే, మీ గోప్యత పూర్తి సురక్షితంగా ఉంటుంది. వ్యక్తిగత సమాచారం దేనినీ సేకరించడం లేదా షేర్ చేయడం జరగదు, కాబట్టి మిమ్మల్ని గుర్తించే మార్గమే లేదు. DOH మాత్రమే ఈ డేటాను యాక్సెస్ చేయగలుగుతుంది, అదీ రాష్ట్ర స్థాయిలో మాత్రమే.

26.    WA Notify వినియోగదారులు వారి డేటాను షేర్ చేసుకోవడానికి అంగీకరిస్తే, ఏమి సేకరిస్తారు?

మీరు మీ డేటాను షేర్ చేయడానికి అంగీకరిస్తే, మీ గోప్యత పూర్తి సురక్షితంగా ఉంటుంది. వ్యక్తిగత సమాచారం దేనినీ సేకరించడం లేదా షేర్ చేయడం జరగదు, కాబట్టి మిమ్మల్ని గుర్తించే మార్గమే లేదు. Washington State Department of Health (వాషింగ్టన్ రాష్ట్ర ఆరోగ్య శాఖ) మాత్రమే ఈ రాష్ట్ర-స్థాయి డేటాను చూడగలదు, దానిలో ఇవి ఉంటాయి:

  • తమ WA Notify డేటాను షేర్ చేసుకోవడానికి అంగీకరించిన వ్యక్తుల సంఖ్య. మా నమూనా ఎంత వరకు ప్రాతినిధ్యం వహిస్తున్నదో తెలుసుకోవడానికి ఇది మాకు సహాయపడుతుంది.
  • WA Notify వినియోగదారులు అందుకున్న ఎక్స్పోజర్ నోటిఫికేషన్ల సంఖ్య. కోవిడ్-19వ్యాప్తికి సంబంధించిన ధోరణులను గమనించడానికి ఇది మాకు సహాయపడుతుంది.
  • ఎక్స్పోజర్ నోటిఫికేషన్పై క్లిక్ చేసే వ్యక్తుల సంఖ్య. ప్రజారోగ్య శాఖ సిఫారసులను పరిగణనలోకి తీసుకోవడానికి ప్రజలు ఎంత సుముఖంగా ఉన్నారో తెలుసుకోవడానికి ఇది మాకు సహాయపడుతుంది. 
  • కోవిడ్-19పాజిటివ్ అని పరీక్షలో తేలిన వారికి సన్నిహితంగా ఉన్నా, తగినంత సమయం లేని, ఎక్స్పోజర్ గురించి నోటిఫై చేయదగినంత ఎక్కువ సమయం లేని వ్యక్తుల సంఖ్య. WA Notifyలో ఎక్స్పోజర్ను నిర్ణయించే అల్గోరిథంను సర్దుబాటు చేయాల్సి ఉన్నదా అనే విషయాన్ని పరిశీలించడానికి ఇది మాకు సహాయపడుతుంది. 

27.    నేను నా ఐఫోన్లో WA Notifyని అనుమతించినప్పుడు, “అందుబాటు హెచ్చరికలు” మీటను నేను ఆన్ చేయడం లేదా ఆఫ్ చేయడం చేయాలా? 

మీరు వాషింగ్టన్ రాష్ట్రానికి వెలుపల గణనీయమైనంత కాలం ప్రయాణిస్తున్నట్లయితే ఆఫ్ చేయడం మంచిది. మీరు వేరే ప్రాంతానికి వెళ్ళినప్పుడు, అందుబాటు హెచ్చరికలు ఆన్లో ఉంటే, WA Notify కాని వేరే ఇతర ఎక్స్పోజర్ నోటిఫికేషన్ సాంకేతికత నుంచి నోటిఫికేషన్ను అందుకోవచ్చు. ఐఫోన్ వినియోగదారులు పలు ప్రాంతాలను జోడించగలరు కాని, ఒక సమయంలో ఒక ప్రాంతాన్ని మాత్రమే యాక్టివ్గా ఉండేదిగా చేయగలుగుతారు. కొత్త దాన్నియాక్టివేట్ చేయడానికి ఒక ప్రాంతాన్ని తొలగించవలసిన అవసరం లేదు. ఆండ్రాయిడ్ వినియోగదారులు పలు రాష్ట్రాలకు సంబంధించిన WA Notify వంటి ఎక్స్పోజర్ నోటిఫికేషన్ యాప్లను కూడా ఇన్స్టాల్ చేసుకోవచ్చు. కాని, WA Notifyకి అనుగుణంగా ఉండే సాంకేతికతను ఉపయోగించే వాటిలో ఏదో ఒకటి మాత్రమే ఒక సమయంలో యాక్టివ్గా ఉండేదిగా ఉంటుంది.

28.    WA Notify బ్యాటరీని చాలా ఎక్కువగా ఉపయోగిస్తున్నట్టు కనిపిస్తుంది ఎందువలన?

వాస్తవానికి, బహుశా అది అలా చేయకపోవచ్చు. మీ పరికరంలో ఉండే బ్యాటరీ వాడకం WA Notify వంటి వాటితోసహా వివిధ యాప్ల రోజువారీ బ్యాటరీ వాడకం శాతాలను చూపిస్తుంది. చాలా యాప్లు రాత్రిపూట పనిచేయవు. WA Notify కూడా పని చేయదు, కానీ ఇది పాజిటివ్ వినియోగదారుకు సరిపోయే మ్యాచ్ల కోసం ప్రతి కొన్ని గంటలకు ఒకసారి యాదృచ్ఛిక కోడ్లను తనిఖీ చేస్తుంటుంది, తద్వారా అది మిమ్మల్ని సంభవనీయమైన ఏవైనా ఎక్స్పోజర్ల గురించి మిమ్మల్ని హెచ్చరిస్తుంది. కాబట్టి, ఉదాహరణకు, మీరు నిద్రిస్తున్నప్పుడు ఇతర యాప్లు ఏవీ పని చేయకపోతే, ఆ సమయంలో WA Notify బ్యాటరీని అధిక శాతం ఉపయోగించినట్టు కనిపిస్తుంది. అలా అని WA Notify చాలా బ్యాటరీని ఉపయోగిస్తుందని దీని అర్థం కాదు - బ్యాటరీ వాడకంలోని ఒక చిన్న మొత్తంలో అధిక శాతం మాత్రమే. 

29.    ఆండ్రాయిడ్ ఫోన్ల WA Notify యాప్కు సంబంధించిన సాంకేతిక మద్దతు నాకు అందుతుందా?

అవును. హార్డ్వేర్ సమస్యలు ఉన్న వ్యక్తుల కోసం సలహాను లేదా అదనపు నిర్దేశాలను అభ్యర్థించడానికి Google ఒక ఇమెయిల్ను ఏర్పాటు చేసింది. exposure-notifications-api-support@google.comకు ఇమెయిల్ చెయ్యండి. 

30.    వాషింగ్టన్ రాష్ట్ర ప్రభుత్వం WA Notifyని 29 భాషలలో విడుదల చేసింది. కాని, Google Play స్టోర్లో నేను దానిని ఇంగ్లిష్, స్పానిష్ భాషలలో మాత్రమే ఎందుకు చూడగలుగుతున్నాను?

WA Notify వినియోగదారు ఫోన్లో డిఫాల్ట్గా సెట్ చేసిన భాష ఆధారంగా పనిచేస్తుంది. WA Notifyకి ఒక్క వెర్షన్ మాత్రమే ఉంది, కానీ ఏవైనా పాప్-అప్లు – ఉదాహరణకు, ఎక్స్పోజర్ నోటిఫికేషన్ వంటివి – వాషింగ్టన్ రాష్ట్ర ప్రభుత్వం అందుబాటులో ఉంచిన 29 భాషలలో నుంచి వినియోగదారు కొరుకున్న భాషలో కనిపిస్తుంది. 

ప్రస్తుత నవీకరణలు

జూన్ 26, 2020 నాటికి, వాషింగ్టన్ స్టేట్ లోని ప్రజలందరూ ఇండోర్ బహిరంగ ప్రదేశంలో లేదా ఆరుబయట ఉంటే మరియు ఇతరుల నుండి 6 అడుగుల (2 మీటర్లు) దూరంలో ఉండలేకపోతే ఫేస్ కవరింగ్ ను ధరించాలి. కొంతమందికి ఆరోగ్య పరిస్థితులు సరిగ్గా ఉండపోవచ్చు, వారు ముఖ కవరింగ్ ని ధరించడం సురక్షితం కాదు, కాని వారు వైద్య పరిస్థితి ఉందని రుజువు చూపించాల్సిన అవసరం లేదు. అలాగే, యజమానులందరూ పని దగ్గర ఒంటరిగా ఉండని ఉద్యోగులందరికీ ఫేస్ కవరింగ్ లేదా మాస్క్ లు అందించాలి.

మే 31 న, గవర్నర్ Inslee అన్ని ఎనర్జీ, ల్యాండ్లైన్ టెలిఫోన్ మరియు నీటి వినియోగాల కోసం జూలై 28 వరకు సర్వీసు తీసేయబడుతుంది మరియు ఆలస్య రుసుముపై ప్రభుత్వం తాత్కాలిక నిషేధాన్ని పొడిగించింది. నివాసితులు తమ బిల్లులను చెల్లించడంలో సహాయం గురించి అడగడానికి నేరుగా వారి యుటిలిటీ కంపెనీకి కాల్ చేయమని ప్రోత్సహిస్తారు.

గవర్నర్ తొలగింపులపై తాత్కాలిక నిషేధాన్ని ఆగస్టు 1 వరకు పొడిగించారు. మీ భూస్వామి లేదా ప్రాపర్టీ మేనేజర్ తాత్కాలిక నిషేధాన్ని ఉల్లంఘిస్తుంటే, మీరు స్టేట్ అటార్నీ జనరల్ కార్యాలయానికి కాల్ చేసి (833) 660-4877 ద్వారా మీరు చెప్పాలి అనుకున్నది చెప్పేయండి మరియు 1. ఎంపికను ఎంచుకోవడంవలన ఎవరో ఒక సిబ్బంది సభ్యుడు మీకు ఫోన్ కి తిరిగి చేస్తారు.

COVID-19 అంటే ఏమిటి?

COVID-19 అనేది శ్వాసకోశ అనారోగ్యం. ఇది తుమ్ములు మరియు దగ్గు, హ్యాండ్‌షేక్స్‌తో సహా ఇతరులతో సన్నిహిత సంబంధాలు మరియు ఆహారం లేదా పానీయాలను పంచుకోవడం ద్వారా వ్యాపిస్తుంది.

లక్షణాలు ఏమిటి?

COVID-19 యొక్క ప్రధాన లక్షణాలు దగ్గు, ఊపిరి తీసుకోవడం లేదా కనీసం ఈ రెండు లక్షణాలలో ఎదో ఒకటి: జ్వరం, చలి, చలితో పదేపదే వణుకు, కండరాల నొప్పి, తలనొప్పి, గొంతు నొప్పి, కొత్తగా రుచి లేదా వాసన తెలియకపోవడం.

ఎవరు ఎక్కువగా ప్రమాదంలో ఉన్నారు?

COVID-19 నుండి వృద్ధులు, ఇతర వైద్య పరిస్థితులు ఉన్నవారు మరియు గర్భిణీ స్త్రీలు తీవ్రమైన అనారోగ్యానికి గురయ్యే ప్రమాదం ఉంది.

మిమ్మల్ని మరియు మీ సంఘాన్ని రక్షించుకోండి:

  • ముఖ్యంగా మీరు అనారోగ్యంతో ఉంటే, సాధ్యమైనంతవరకు ఇంట్లో ఉండండి.
  • బహిరంగంగా గుడ్డ ముఖ కవరింగ్ ని ఉపయోగించండి.
  • ఇతరుల నుండి ఆరు అడుగుల (2 మీటర్లు) దూరంలో ఉండండి.
  • మీ చేతులను తరచుగా కడుక్కోవాలి లేదా హ్యాండ్ శానిటైజర్ వాడండి.
  • మీ దగ్గు మరియు తుమ్ములను కవర్ చేసుకోండి.
  • మీ ముఖాన్ని ముట్టుకోవద్దు.
  • మీ ఇంటిలో ఉపరితలాలను శుభ్రం చేసుకోండి.
  • మీకు COVID-19 లక్షణాలు ఉంటే, మీ ఆరోగ్య సంరక్షణ ప్రదాతని సంప్రదించి పరీక్షించమని అడగండి. మీకు ఆరోగ్య సంరక్షణ ప్రదాత లేకపోతే, మీకు సమీపంలో ఉన్న అత్యవసర సంరక్షణ కేంద్రాన్ని సంప్రదించండి. మీకు భీమా లేకపోతే, మీ స్థానిక ఆరోగ్య విభాగాన్ని సంప్రదించండి.

COVID-19 గురించి అదనపు సమాచారం మరియు వనరులు మరియు ఆరోగ్యంగా ఉండటం:

వాషింగ్టన్ ను తిరిగి తెరవడం: Safe Start Plan

COVID-19 వ్యాప్తిని ఆపడానికి, గవర్నర్ Inslee వాషింగ్టన్ నివాసితులను వీలైనంత వరకు ఇంటిలో ఉండమని కోరారు. వ్యాపారాలు మరియు కార్యకలాపాలను తిరిగి తెరవడానికి నాలుగు దశల ప్రణాళిక ఉంది. ప్రతి కౌంటీ నాలుగు దశల ద్వారా ముందుకు సాగాలి.

ప్రస్తుతం అనుమతించబడిన ముఖ్య కార్యకలాపాలు ఏమిటంటే:

  • కిరాణా షాపింగ్, గ్యాస్ పొందడం, మెడిసిన్ తీసుకోవడం లేదా వైద్య అపాయింట్మెంట్ కి వెళ్లడం వంటి ముఖ్యమైన కార్యకలాపాలు.
  • గవర్నర్ Safe Start Plan కింద అవసరమైన వ్యాపారంలో లేదా తిరిగి తెరవడానికి అనుమతించబడిన వ్యాపారంలో పని చేయడానికి వెళ్లడం.
  • సమీప రెస్టారెంట్ నుండి టేకౌట్ ఆహారాన్ని తీసుకోవడం. 2 వ దశలో రెస్టారెంట్లు ప్రారంభించి పరిమితంగా కూర్చునేందుకు తెరిచి ఉన్నాయి.
  • ఆరు అడుగుల (2 మీటర్లు) భౌతిక దూరం ఉన్నంతవరకు నడక మరియు వ్యాయామం కోసం బయటికి వెళ్లడం. మీ కమ్యూనిటీ వెలుపల COVID-19 వ్యాప్తి చెందకుండా ఉండటానికి ఇంటికి దగ్గరగా ఉన్న ప్రాంతాలలో పునఃసృష్టి చేయండి.
  • చేపలు పట్టడం, వేట మరియు ఇతర వినోద ప్రయోజనాల కోసం రాష్ట్ర ఉద్యానవనాలు మరియు ప్రభుత్వ భూములను పగలు వాడండి. కనీసం 2 వ దశలో ఉన్న కౌంటీలలోని స్టేట్ పార్కులలో క్యాంపింగ్ అనుమతించబడుతుంది.

ఉపాధి & వ్యాపారానికి సంబంధించిన వనరులు

నిరుద్యోగ ప్రయోజనాలు

మీరు మీ ఉద్యోగాన్ని కోల్పోతే, మీరు నిరుద్యోగ ప్రయోజనాలకు అర్హత పొందవచ్చు. నిరుద్యోగ ప్రయోజనాల కోసం దావాను ఎలా పూరించాలో మీకు సమాచారం అవసరమైతే, మీరు 1-800-318-6022 కు కాల్ చేయవచ్చు. వారు స్పందించినప్పుడు, వ్యాఖ్యాన సేవలకు ప్రాప్యత పొందడానికి మీ భాష పేరును చెప్పండి.

ఉద్యోగులు మరియు వ్యాపార యజమానులు

కరోనావైరస్ మహమ్మారి మన రాష్ట్రంలో లక్షలాది మంది ఉద్యోగులను మరియు యజమానులను ప్రభావితం చేసింది.

ఉద్యోగులను సురక్షితంగా ఉంచడానికి, యజమానులు వీటిని చేయటం అవసరం:

  • COVID-19 యొక్క సంకేతాలు మరియు లక్షణాల గురించి వారి ఉద్యోగులకు వారు అర్థం చేసుకునే భాషలో అవగాహన కల్పించండి.
  • సామాజిక దూర ప్రణాళికను అమలు చేయండి.
  • తరచుగా శుభ్రపరచండి మరియు శానిటైజ్ చేయండి నిర్వహించండి.
  • తరచుగా మరియు సరిగ్గా చేతులు కడుక్కోవాలని నిర్ధారించుకోండి.
  • అనారోగ్య ఉద్యోగులు ఇంట్లోనే ఉండేలా చూసుకోండి.

మీ కార్యాలయ భద్రత గురించి మీకు సమస్యలు ఉంటే, మీరు Department of Labor & Industries కి నేరుగా 800-423-7233 నంబర్ కు కాల్ చేసి ఫిర్యాదు చేయవచ్చు. ఫోన్ వ్యాఖ్యాన సేవలు అందుబాటులో ఉన్నాయి.

COVID19 సమయంలో మీ వ్యాపారం మరియు ఉద్యోగుల గురించి మీకు ప్రశ్నలు ఉంటే, మీరు ఉపాధి భద్రతా విభాగానికి 855-829-9243 ద్వారా కాల్ చేయవచ్చు.

ఆరోగ్య సంరక్షణ మరియు ఆరోగ్య భీమా వనరులు

మీరు ఉచిత లేదా తక్కువ ఖర్చుతో కూడిన ఆరోగ్య భీమాకు అర్హత పొందవచ్చు. 1-855-923-4633 ద్వారా Health Care Authority కి కాల్ చేయండి. వారు స్పందించినప్పుడు, వ్యాఖ్యాన సేవలకు ప్రాప్యత పొందడానికి మీ భాష పేరును చెప్పండి.

Alien Emergency Medical (AEM) కవరేజ్ అనేది అర్హత కలిగిన వైద్య అత్యవసర పరిస్థితి ఉన్న మరియు పౌరసత్వం లేదా ఇమ్మిగ్రేషన్ అవసరాలను తీర్చని లేదా 5 సంవత్సరాల బార్ ను అందుకోని అర్హత కలిగిన వ్యక్తుల కోసం ఒక కార్యక్రమం.

1-800-322-2588 ద్వారా Help Me Grow వాషింగ్టన్ COVID-19 హాట్లైన్ మీకు అర్హత ఉన్న వివిధ ఆరోగ్య కార్యక్రమాలను మరియు సేవలను గుర్తించగలదు మరియు మీరు దరఖాస్తు చేసుకోవడంలో సహాయపడుతుంది. ఇందులో ఇవి ఉన్నాయి:

  • WIC (మహిళలు, శిశువులు & పిల్లల పోషకాహార కార్యక్రమం)
  • పిల్లలు, గర్భిణీ స్త్రీలు మరియు పెద్దలకు ఆరోగ్య భీమా
  • Take Charge ప్రోగ్రామ్ ద్వారా జనన నియంత్రణ
  • ఆరోగ్య మరియు కుటుంబ నియంత్రణ క్లినిక్ లు
  • గర్భం మరియు శిశువు సరఫరాలు
  • తల్లి పాలివ్వటానికి మద్దతు
  • వారికి ఆహార కార్యక్రమాలు మరియు వనరులు కూడా ఉన్నాయి.

వలస మరియు శరణార్థుల సమాచారం

Office of Immigrant and Refugee Affairs (OIRA) వలసదారులకు Covid -19 గురించి ముఖ్యమైన వాస్తవాలు మరియు వలసదారుల ఆందోళనలు పబ్లిక్ ఛార్జ్ వంటి వాటిని అర్థం చేసుకోవడానికి సహాయపడుతుంది. మరికొన్ని ముఖ్యమైన తెలుసుకోవలసిన విషయాలు:

  • పౌరసత్వం లేదా ఇమ్మిగ్రేషన్ స్థితిని ICE తో పంచుకోవడానికి ఆసుపత్రులు మరియు క్లినిక్లు అనుమతించబడవు.
  • COVID-19 కోసం పరీక్షించడం మరియు ఛారిటీ లేదా రాయితీ వైద్య సంరక్షణను పొందడంవళ్ళ గ్రీన్ కార్డ్ లేదా పౌరసత్వం కోసం దరఖాస్తు చేసే మీ సామర్థ్యాన్ని ప్రభావితం చేయదు.
  • నిరుద్యోగ ప్రయోజనాల కోసం దరఖాస్తు చేసుకోవడానికి మీకు చెల్లుబాటు అయ్యే సామాజిక భద్రతా సంఖ్య అవసరం. ఒకవేళ మీరు నిరుద్యోగ ప్రయోజనాలను పొందడం గురించి ఎవరితోనైనా మాట్లాడాలనుకుంటే 1-800-318-6022 కు కాల్ చేయండి.
  • నిరుద్యోగ ప్రయోజనాలను స్వీకరించడం మీ దరఖాస్తు సామర్థ్యాన్ని లేదా గ్రీన్ కార్డ్ ను లేదా పబ్లిక్ ఛార్జ్ నిబంధనల ప్రకారం పౌరసత్వం అప్లై చేసుకోవటానికి ఇబ్బంది కలిగించదు.
  • Covid-19 తో అనారోగ్యంతో ఉన్న వ్యక్తిని మీరు శ్రద్ధ వహించడానికి లేదా మీరు వైరస్ కారణంగా అనారోగ్యంతో ఉంటే మీ గురించి జాగ్రత్తగా చూసుకోవడానికి వాషింగ్టన్ స్టేట్ పెయిడ్ ఫ్యామిలీ మరియు మెడికల్ లీవ్ కోసం అర్హత పొందవచ్చు. ఈ ప్రయోజనాన్ని పొందడానికి మీకు సామాజిక భద్రతా సంఖ్య అవసరం లేదు. ESD అనేక ఇతర రకాల డాక్యుమెంటేషన్ ను అంగీకరిస్తుంది.
  • మీరు సహాయం కోసం చూస్తున్న వ్యాపార యజమాని అయితే, ఫెడరల్ Small Business Administration డిజాస్టర్ లోన్ గ్రీన్ కార్డ్ కోసం దరఖాస్తు చేసుకోవడంవలన మీ సామర్థ్యాన్ని లేదా కొత్త పబ్లిక్ ఛార్జ్ చట్టాల ప్రకారం పౌరసత్వానికి ఇబ్బంది కలిగించదు.

పబ్లిక్ ఛార్జ్ పై ప్రత్యేక గమనిక: చాలా మంది న్యాయవాదులు కుటుంబాలకు అర్హత ఉన్న సేవలను ఉపయోగించడం కొనసాగించాలని సిఫార్సు చేస్తున్నారు. అయితే, ప్రతి ఇమ్మిగ్రేషన్ పరిస్థితి ప్రత్యేకమైనది. మీ స్థితి లేదా కుటుంబ సభ్యుల స్థితి మరియు/లేదా ప్రయోజనాల ఉపయోగం గురించి మీకు తెలియకుండా ఉంటే, మీరు ఇమ్మిగ్రేషన్ అటార్నీ లేదా Department of Justice (DOJ) గుర్తింపు పొందిన ప్రతినిధితో మాట్లాడాలని Office of Immigrant and Refugee Affairs (OIRA) సిఫార్సు చేస్తుంది. మీరు American Immigration Lawyers Association ద్వారా న్యాయవాదిని కనుగొనవచ్చు. లేదా మీరు DOJ- గుర్తింపు పొందిన సంస్థ వెబ్సైట్ను సందర్శించవచ్చు.

OIRAలో శరణార్థులు మరియు వలసదారులకు సహాయపడే కార్యక్రమాలు ఉన్నాయి:

  • ఉద్యోగ శోధన మరియు శిక్షణ.
  • ఇమ్మిగ్రేషన్ మద్దతు.
  • యూత్ మెంటరింగ్.
  • శరణార్థ పెద్దలు, పిల్లలు, విద్యార్థులు మరియు ఇతరులకు మద్దతు.
  • COVID-19 సమయంలో రెగ్యులర్ ప్రోగ్రామ్ లు రిమోట్ గా తెరిచి ఉంటాయి. ఉద్యోగాలు లేదా నిరుద్యోగం కోసం దరఖాస్తు చేసుకోవడానికి, మీ విద్యకు మద్దతు ఇవ్వడానికి మరియు గృహనిర్మాణానికి సహాయం అందించడానికి కార్యాలయంలో కొత్త సేవలు ఉన్నాయి. సెప్టెంబర్ 30, 2020 వరకు రెఫ్యూజీ క్యాష్ అసిస్టెన్స్ మరియు రెఫ్యూజీ మెడికల్ అసిస్టెన్స్ అర్హతను పొడిగించారు.
  • సేవలు మరియు మరింత సమాచారం కోసం, 360-890-0691కు కాల్ చేయండి.

వలసదారుల హక్కుల గురించి, అదుపులోకి తీసుకున్న బంధువులు/స్నేహితుల కోసం రిఫెరల్ సహాయం పొందడం మరియు ఇతర సంబంధిత సమాచారం కోసం, మీరు 1-844-724-3737 ద్వారా వాషింగ్టన్ ఇమ్మిగ్రెంట్ సాలిడారిటీ నెట్వర్క్ హాట్లైన్ను సంప్రదించవచ్చు. ఫోన్ వివరణ అందుబాటులో ఉంది.

మానసిక మరియు భావోద్వేగ ఆరోగ్యం

ఇది ఒత్తిడితో కూడుకున్నది అయ్యుండొచ్చు. మీరు లేదా మీ ప్రియమైనవారు ఆందోళన, విచారం, భయపడటం లేదా కోపంగా అనిపించడం సాధారణమే. మీరు ఒంటరి వారు కాదు. సహాయం కోరడం మరియు అడగడం సరైనదేనా.

ప్రతి ఒక్కరూ ఒత్తిడి మరియు క్లిష్ట పరిస్థితులకు భిన్నంగా స్పందిస్తారు. మీరు చేయగలిగే అతి ముఖ్యమైన విషయం మీ గురించి, మీ కుటుంబం మరియు మీ కమ్యూనిటీని మీకు సాధ్యమైనంత ఉత్తమంగా చూసుకోవడం.

సవాళ్ల సమయాల్లో ఎదుర్కోవటానికి మీకు ఏది సహాయపడుతుంది? మీరు స్నేహితులు మరియు కుటుంబంతో కలిసారా మరియు మాట్లాడారా? కొంతవరకు బాగా శ్వాస తీసుకోవడం మరియు స్ట్రెచింగ్స్ చేయడం, కొంత వ్యాయామం లేదా మంచి రాత్రి మంచి నిద్ర అవ్వచ్చు? స్వీయ సంరక్షణ కోసం సమయాన్ని కేటాయించడం, అయితే ఆ సమయం మిమ్మల్ని మీరు ఆత్మ పరిశీలన చేసుకోవచ్చు, ఒత్తిడి తగ్గించుకోవడానికి సహాయపడుతుంది.

1-833-681-0211 ద్వారా Washington Listensకు కాల్ చెయ్యండి. ఫోన్ వ్యాఖ్యాన సేవలు అందుబాటులో ఉన్నాయి. COVID-19 మహమ్మారికి ప్రతిస్పందనగా, వాషింగ్టన్ Washington Listens అనే ఒక మద్దతు కార్యక్రమాన్ని ప్రారంభించింది. Washington Listens సేవలను ఉపయోగించే వ్యక్తులు అధిక ఒత్తిడిని నిర్వహించడానికి మరియు COVID-19 కారణంగా మార్పులను ఎదుర్కోవటానికి మద్దతు పొందుతారు. సహాయ నిపుణుడితో మాట్లాడటానికి వాషింగ్టన్ లో ఎవరికైనా Washington Listens అందుబాటులో ఉంటుంది. ఫోన్ చేసే వారు వారి ప్రాంతంలోని కమ్యూనిటీ వనరులకు మద్దతు మరియు కనెక్షన్ను అందుకుంటారు. కార్యక్రమం పేరులేనిది.

మీరు సంక్షోభంలో ఉంటే మరియు కౌన్సెలింగ్ పొందడానికి ఎవరితోనైనా మాట్లాడవలసిన అవసరం ఉంటే, కొన్ని ఎంపికలు ఉన్నాయి.

  • ఏదైనా ప్రకృతి లేదా మానవుల వల్ల కలిగే విపత్తుకు సంబంధించిన మానసిక క్షోభను ఎదుర్కొంటున్న వ్యక్తులకు 1-800-985-5990 కు కాల్ చేయడం ద్వారా Disaster Distress Helpline తక్షణ సంక్షోభ సలహాను ఇస్తుంది. వారు స్పందించినప్పుడు, వ్యాఖ్యాన సేవలకు ప్రాప్యత పొందడానికి మీ భాష పేరును చెప్పండి. ప్రతిరోజూ హెల్ప్లైన్ 24 గంటలు అందుబాటులో ఉంటుంది.
  • Crisis Connectionsకు 24-గంటల సంక్షోభ రేఖను కలిగి ఉన్నాయి, ఇది మానసిక సంక్షోభంలో ఉన్న వ్యక్తులు, కుటుంబాలు మరియు వ్యక్తుల స్నేహితులకు తక్షణ సహాయంను అందిస్తుంది. ఇది King కౌంటీలో నివసించే ప్రజలకు సేవలు అందిస్తుంది. భాషా వివరణ అందుబాటులో ఉంది. 1-866-427-4747 కు కాల్ చేయండి.
  • National Suicide Prevention Lifeline ఆత్మహత్య గురించి ఆలోచించే వ్యక్తుల కోసం నివారణ మరియు సంక్షోభ వనరులను అందిస్తుంది. ప్రియమైన వారు కుటుంబం మరియు స్నేహితులకు సహాయపడటానికి వనరులను పొందడానికి లైఫ్లైన్కు కాల్ చేయవచ్చు. 1-800-273-8255కు కాల్ చేయండి. ఈ హాట్లైన్ రోజుకు 24 గంటలు, వారానికి 7 రోజులు అందుబాటులో ఉంటుంది. అనుభవజ్ఞుల కోసం ఒక నిర్దిష్ట హెల్ప్లైన్ ఉంది. 1-800-273-8255 కు కాల్ చేసి, ఆపై 1 నొక్కండి. మీరు చెవిటివారు మరియు సరిగ్గా వినపడనివారైతే, 1-800-799-4889 కు కాల్ చేయండి.

ఆహార వనరులు

మీకు 18 ఏళ్లు లేదా అంతకంటే తక్కువ వయస్సు ఉన్న పిల్లలు ఉంటే వారు పాఠశాలల నుండి ఉచిత ఆహారాన్ని పొందవచ్చు. విద్యా కార్యక్రమాలలో చేరిన వైకల్యాలున్న పెద్దలు పాఠశాల భోజనానికి కూడా అర్హత పొందవచ్చు. అనేక సందర్భాల్లో, ఈ భోజనం బస్ స్టాప్ వంటి ఆఫ్-స్కూల్ ప్రదేశాలలో పంపిణీ చేయబడుతోంది లేదా అందించబడుతుంది. వారు ఉచిత భోజనం అందిస్తున్నారో లేదో తెలుసుకోవడానికి మీ పాఠశాల జిల్లాను సంప్రదించండి.

గర్భిణీలు, కొత్త తల్లులు మరియు ఐదు సంవత్సరాల కంటే తక్కువ వయస్సు ఉన్న పిల్లలకు, మీరు Department of Health యొక్క మహిళలు, శిశువులు మరియు పిల్లలు (WIC) కార్యక్రమం ద్వారా ఆహారాన్ని పొందవచ్చు. భాషా సహాయం కోసం, 1-866-632-9992 కు కాల్ చేయండి.

Covid-19 సమయంలో ఆహారంలో డిమాండ్ పెరిగినందున ఫుడ్ బ్యాంకులు తమ గంటలను మార్చవచ్చు లేదా వాక్-ఇన్ ట్రాఫిక్ మూసివేయబడవచ్చు. వెళ్ళడానికి ముందు కాల్ చేయండి. Northwest Harvest అనేది రాష్ట్రవ్యాప్తంగా ఫుడ్ బ్యాంక్ నెట్వర్క్. ఈ వెబ్సైట్లోని గ్రీన్ బాక్స్ కు ఎడమ బాక్స్ లో మీ నగరం పేరును టైప్ చేయండి.

మీరు తూర్పు వాషింగ్టన్ లో నివసిస్తుంటే Second Harvest వద్ద ఆహార బ్యాంకుల జాబితాను కనుగొనవచ్చు. మీ ప్రాంతంలోని ఆహార బ్యాంకుల జాబితా కోసం ఈ వెబ్సైట్లో మీ కౌంటీని ఎంచుకోండి.

కుటుంబాలకు వనరులు మరియు సమాచారం

ఇది మొత్తం కుటుంబానికి ఒత్తిడితో కూడుకున్న సమయం. మీ పిల్లలతో ఈ పరిస్థితిని ఎలా నిర్వహించాలో ఇక్కడ కొన్ని చిట్కాలు ఉన్నాయి:

కుటుంబ చర్చలను సౌకర్యవంతమైన ప్రదేశంలో చేసుకోండి మరియు కుటుంబ సభ్యులను ప్రశ్నలు అడగమని ప్రోత్సహించండి. చిన్న పిల్లలతో వారు అర్థం చేసుకోగలిగే భాషను ఉపయోగించటానికి మరియు వారి నిర్దిష్ట భయాలు లేదా అపోహలను పరిష్కరించడానికి ప్రత్యేక చర్చను పరిగణించండి.

టెలిఫోన్ లేదా ఆన్లైన్ సేవల ద్వారా కుటుంబం మరియు స్నేహితులతో సన్నిహితంగా ఉండండి.

మీకు సమాచారం చెప్పాల్సిన అవసరం ఉన్నప్పటికీ, భయం లేదా భయాందోళనలను ప్రోత్సహించే మీడియా సంస్థలు లేదా సోషల్ మీడియాకు గురికావడాన్ని తగ్గించండి. మహమ్మారి గురించి తెలుసుకోవడానికి మీ పిల్లలు మీడియా కవరేజ్ లేదా సోషల్ మీడియాకి సమయం ఎంత వెచ్చిస్తున్నారు (మరియు పరిమితం చేయండి).

ప్రశ్నలను ప్రోత్సహించడం ద్వారా మరియు ప్రస్తుత పరిస్థితిని అర్థం చేసుకోవడంలో వారికి సహాయపడటం ద్వారా పిల్లలకు మద్దతు ఇవ్వడంపై దృష్టి పెట్టండి.

  • వారి భావాల గురించి మాట్లాడండి మరియు వాటిని ధృవీకరించండి.
  • డ్రాయింగ్ లేదా ఇతర కార్యకలాపాల ద్వారా వారి భావాలను వ్యక్తపరచడంలో వారికి సహాయపడండి.
  • వైరస్ ఎలా వ్యాపించిందనే దానిపై తప్పుడు సమాచారం లేదా అపార్థాలను మరియు ప్రతి శ్వాసకోశ వ్యాధి COVID-19 కి కారణమయ్యే నోవల్ కరోనావైరస్ కాదు అని స్పష్టం చేయండి.
  • సౌకర్యాన్ని మరియు కొంచెం అదనపు సహనాన్ని అందించండి.
  • మీ పిల్లలతో రోజూ లేదా పరిస్థితి మారినప్పుడు తిరిగి తెలుసుకోండి.
  • నిద్రవేళలు, భోజనం మరియు వ్యాయామం విషయానికి వస్తే మీ కుటుంబ షెడ్యూల్ ను స్థిరంగా ఉంచండి.
  • ఇంట్లో మీరు మరియు మీ కుటుంబ సభ్యులు ఇతర ఒత్తిడితో కూడిన పరిస్థితులలో మంచి అనుభూతిని కలిగించే పనులను ఇంట్లో చేయడానికి సమయం కేటాయించండి ఎటువంటివి అంటే చదవడం, సినిమాలు చూడటం, సంగీతం వినడం, ఆటలు ఆడటం, వ్యాయామం చేయడం లేదా మతపరమైన కార్యకలాపాలలో పాల్గొనడం(ఇంటర్నెట్ లో ప్రార్థన, సేవల్లో పాల్గొనడం).
  • ఒంటరితనం, విసుగు, వ్యాధి సంభవిస్తుందనే భయం, ఆందోళన, ఒత్తిడి మరియు భయం వంటి భావాలు మహమ్మారి కారణంగా ఒత్తిడితో కూడిన పరిస్థితికి సాధారణ ప్రతిచర్యలు అని గుర్తించండి.
  • మీ కుటుంబం మరియు సాంస్కృతిక విలువలకు అనుగుణంగా ఆహ్లాదకరమైన మరియు అర్ధవంతమైన కార్యకలాపాల్లో పాల్గొనడానికి మీ కుటుంబానికి సహాయం చేయండి.

60 ఏళ్లు పైబడిన పెద్దలు COVID-19 నుండి తీవ్రమైన అనారోగ్యానికి గురయ్యే ప్రమాదం ఉంది. మీ కుటుంబంలోని పాత సభ్యులు మీతో నివసిస్తుంటే, ప్రమాదాన్ని తగ్గించే మార్గాలను గుర్తించండి.

  • తక్కువ ప్రమాదం ఉన్న కుటుంబంలోని వ్యక్తులతో కిరాణా షాపింగ్ మరియు ఇతర ముఖ్యమైన కార్యకలాపాలు చేయండి.
  • ప్రతి ఒక్కరూ ఇంటికి వచ్చిన వెంటనే చేతులు కడుక్కోవాలని నిర్ధారించుకోండి. అందరూ ఉపయోగించే స్థలాలు, ఉపరితలాలు మరియు గదులను తరచుగా శుభ్రపరచండి.
  • మీ ఇంటిలో ఒక వ్యక్తి బహిర్గతమైతే లేదా లక్షణాలు ఉంటే, వారిని మీరు వీలైనంత మంచిగా ఒంటరిగా ఉంచండి. వారు తమ సొంత గది మరియు బాత్రూమ్ కలిగి ఉంటే మంచిది. భాగస్వామ్య ప్రాంతాలను తరచుగా శుభ్రపరచండి మరియు ఎవరైనా అనారోగ్యంతో లేదా అంటుకొనే అవకాశాలు ఎక్కువగా ఉన్న సమయంలో ఇంటిలోని ప్రతి ఒక్కరూ మాస్క్ ధరించుకునేలా నిర్ధారించుకోండి.

అదనపు వనరులు మరియు సమాచారం